Garuda Seva: ఆగస్టులో శ్రీవారికి రెండు సార్లు గరుడసేవ.. ప్రత్యేకత ఇదే


తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని వాహన సేవల కంటే గరుడ సేవకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సేవ కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. గరుడవాహనంపై ఉన్న స్వామిని చూస్తే పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు.

వారి భక్తులకు ఆగస్టులో రెండుసార్లు గరుడవాహన సేవ చూసే మహద్భాగ్యం కలగనుంది. ఆగస్టులో స్వామివారికి రెండు సార్లు గరుడ సేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 5న గరుడ పంచమి, 15న శ్రావణ పూర్ణిమ పర్వదినాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఆగస్టు 5 సోమ‌వారం నాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీమలయప్పస్వామి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

govindarajulu-tirumala
govindarajulu-tirumala

దోషాల నివారణార్థం:


govindarajulu-tirumala

వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ, మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.అలాంటి దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటుచేసు కోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా ఆ దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలాపంతో కూడిన కార్యక్రమాలుగా అత్యంత ప్రవిత్రంగా నిర్వహిస్తారు.

govindarajulu-tirumala

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ఏటా తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. కొత్త దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, మహిళలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారని ప్రాశస్త్యం. కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా ఉండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే శ్రావణ శుద్ధ పంచమి రోజున గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే సోదరులున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 15న గురువారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని వృక్షం వద్ద నాగదేవత విగ్రహం

FOLLOW US FB 74K FOLLOWED

ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని

మొదటిరోజు - అంకురార్పణ

ఆలయ శాసనాలలో: తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుండే ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాలను బట్టి తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుండి టీటీడీ క్రమం తప్పకుండా యేటా శ్రావణమాసం ( ఆగస్టు) లోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశిలలో మూడు రోజులు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది.

రెండో రోజు - సమర్పణ:

తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారు... వీరందరికీ సమర్పిస్తారు. జయవిజయులు, గరుత్మంతునికి, ఆనంద నిలయంపైన కొలువైన విమాన వేంకటేశ్వరునికి, ఆలయంలో పరివార దేవతలైన విష్వక్సేనుడు, యోగ నృశింహస్వామి, ఇతర దేవతామూర్తులు, ఉత్సవమూర్తులకు గ్రహమూర్తులకు, ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామి మూలమూర్తికి, అదే ఆలయంలోని పరివార దేవతలకు, పుష్కరిణి గట్టుపై వెలసిన ఆంజనేయస్వామికి, అఖిలాండం వద్ద బేడి ఆంజనేయస్వామికి పట్టుపవిత్రాలు సమర్పిస్తారు.

మూడోరోజు - ముగింపు:

తొలిరోజు తరహాలో హోమాలు, అభిషేకాదులు, పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగమోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు.

gobest-telugu-website
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

kohli-made-world-record-in-world-cup

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet