మహాద్భుతం: ఆశ్చర్యపరిచే తిరుమల రహస్యాలు!


tirumala-tirupati


తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. మళ్లీమళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజూ లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వేంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. మరి, తిరుమల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా.

1. గర్బగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిమీల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయబద్దంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే, ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు వుంటుంది. ఇది అస్సలు చిక్కు పడదని అంటారు. శ్రీవారు భూవి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలా దేవీ అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది. ఇందుకు ఆయన అంగకరించి జుట్టు కోల్పొయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది.

3. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది.


tirumala-tirupati

4. స్వామివారు గర్భగుడి మధ్యలో వున్నట్లు కనిపిస్తారు. అయితే, ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు.

5. స్వామి వారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది.


6. స్వామివారిని రోజూ కింద పంచె, పైన చీర తో అలంకరిస్తారు.

7. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే, శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు.. తిరుపతికి దాదాపు 20 కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు.

8. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది.

9. వేంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీ దేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేప్పుడు.. లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది.

10. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజూ కొండెక్కవు. నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే.

11. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్లపాటు మూసివేశారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు.

12. సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలువారుతుంది. అయితే, శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా.. చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే, ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారీన్‌హీట్ ఉంటుందట. అయితే, ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది.
tirumala-tirupati

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

FOLLOW US FB 74K FOLLOWED

ఆధారం ఎక్కడ?

దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలనే మా ప్రయత్నం
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :- 'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా –
కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా,
ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయంచెయ్యమన్న సందేశముంది.
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.
శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :- శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం.
శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది.
కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది.
అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది,
తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది.
ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది
తెలుసుకున్నాం కదా అందుకే శ్రీవేంకటేశ్వరుని రూపమే ఆత్మజ్ఞాన ప్రబోధకరం అయ్యింది
వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.[1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

keywords : tirumala live status for dharshan queue, tirumala crowd status live, today tirumala dharshan live status, waiting time in tirumala for sarva dharshan, తిరుమల తిరుపతి live update, Tirumala Darshan crowd today. Tirumala darshan by walk rush today. Tirumala samacharam today", "TTD live status", Tirumala Crowd Status, tirumala update, tirumala status, today tirumala live darshan

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet