కపిల తీర్ధం

Alipiri-tirumala-kapila-theertham

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.

తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు. తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, వినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.

వైష్ణవతీర్థం theerthams-tirumala

విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి,ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు. ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.
సంతతి లేనివారు సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
పుణ్య స్నానం ఇక్కడి తీర్థంలో పుణ్య స్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచాలౌతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.

జపాలి తీర్థం, అంజనాద్రిపై శ్రీరామ తీర్థం, సీతా తీర్థం... హనుమంతుడు అక్కడే...
theerthams-tirumala

రామ భక్త హనుమ శ్రీనివాసుని దాసానుదాసుడు కూడా. కలియుగ వైకుంఠ వాసుని సేవించడానికి తిరుమలగిరులలో అనేకానేక పేర్లలో వెలిశాడు. ఏడుకొండల్లో ఓ కొండ.. హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి.
జపాలి మహర్షి శ్రీ ఆంజనేయుని అనుగ్రహం తో శ్రీ రాముని దర్శనం కోరి గొప్ప తపస్సు చేసిన ప్రదేశమిది . శ్రీ తిరుమల శ్రీ వారి ఆలయానికి అతి దగ్గరలో ఉంది . జపాలి మహర్షి కి దర్శనమిచ్చిన ఆంజనేయ స్వామి స్వయం భు గ వెలసి ఉన్నాడు . జాపాలి తీర్థం లో స్నానం చేసిన బక్తుల పాపాల నుంచి విముక్తి అవుతారు అని పురాణం గాథ .
రామ భక్త హనుమ శ్రీనివాసుని దాసానుదాసుడు కూడా. కలియుగ వైకుంఠ వాసుని సేవించడానికి తిరుమలగిరులలో అనేకానేక పేర్లలో వెలిశాడు. ఏడుకొండల్లో ఓ కొండ.. హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమూ ఇదేనంటారు. ఆ స్థల మహత్యం తెలిసిన జాపాలి ఈ కోనలో ఘోర తపస్సు చేశాడట.

తిరుమల పుష్కరిణి

theerthams-tirumala

శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం.

చక్ర తీర్థం

theerthams-tirumala

తిరుమలలోని చక్ర తీర్థం ప్రసిద్ధ తీర్థంలో ఒకటి. ఇది సిలతోరణం పక్కన ఉంది మరియు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సైట్ను సందర్శించడం భగవంతుని లోటస్ ఫీట్ ను తాకినట్లుగా పరిగణించబడుతుంది, ఇది భక్తులను వారి కష్టాల నుండి విముక్తి చేస్తుంది.

Chakra Theertham
Situated at a distance of 2 Kms from Tirumala Bus Station & 3 km from Tirumala Tirupati Balaji Temple, Chakra Theertham is the site for a water body near Sila Thornam and is associated with an interesting legend. According to the legend, Lord Brahma wanted to observe penance and to clean this place, Lord Vishnu plunged his Sudershana Chakram, thus creating a crater. It is one of the famous places of sightseeing in Tirumala. Visiting this site is considered as good as touching the Lotus Feet of the Lord, which will deliver the devotees from their travails. The waterfall here is an amazing sight to behold and is the location where the idol of Lord Venkateswara is brought during the Brahmotsvam celebrations.

ప్రసిద్ధ తీర్థంలో ఒకటి వైకుంత తీర్థం

theerthams-tirumala

వైకుంత తీర్థం ప్రసిద్ధ తీర్థంలో ఒకటి. వైకుంఠ తీర్థం ఒక పవిత్ర జలపాతం, ఇది విష్ణువు అవతారంతో లార్డ్ రాముడిగా ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం, లార్డ్ రాముడి వనార సేన నుండి వచ్చిన కోతులు ఇక్కడ వైకుంఠంను చూశాయి మరియు దీని తరువాత ఈ ప్రదేశం వైకుంఠ తీర్థం అని పిలువబడింది.


Vaikunta Theertham is one of the popular theertham. Vaikuntha Teertham is a holy waterfall, which is linked with Lord Vishnu’s incarnation as Lord Rama. Legend has it that the monkeys from Lord Rama’s vanara sena saw Vaikuntham here and it was after this that this place came to be known as Vaikuntha Theertham.

ఆకాశ గంగ

akasa-gangatheerthams-tirumala

ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం

Akasha Ganga Theertham Tirumala is one of the popular theertham, Akash Ganga Theertham, Waterfalls is the most sacred waterfall near Tirupathi. It is from this falls, water has been carried for abhisekam (bathing) the main deity of Sri Venkateshwara Swamy.

FOLLOW US FB 74K FOLLOWED

పాప వినాశనము

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం పేర్కొంటోంది.
Papavinasam Theertham this place is called Papa(bad karma) – Vinasam(ward off). A beautiful and a pious destination, the Papavinasaram Theertham in Tirupati is the best holy place to visit.

akasa-gangatheerthams-tirumala

శేష తీర్థము


akasa-gangatheerthams-tirumala

తిరుమల లోని ఒక పుణ్య తీర్థం. పాపవినాశనం నుండి కొన్ని మైళ్ళు అడవిలో నడిస్తే శేష తీర్థం చేరుకుంటారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.

Keywords : "By Walk to Tirumala, Alipiri Mettu, Srivari Mettu, tirumala live status for dharshan queue, tirumala crowd status live, tirumala today live, "తిరుమల తిరుపతి", tirumala rooms information, tirumala queue line status, tirumala news, ttd news, ttd update, daily sevas in tirumala, Facts about Tirumala

govindarajulu-tirumala
govindarajulu-tirumala
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet